బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ తన గతాన్ని పూర్తిగా మర్చిపోయి మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత ఆయనకు లేదని జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభలో గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి కేసీఆర్ ‘డూప్లికేట్ గాంధీలు’ అని చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “కేసీఆర్ వయసులో పెద్దవారు. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. రాహుల్ గాంధీ కుటుంబానికి దేశంలో ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. వారిపై విమర్శలు చేసి కేసీఆర్ తనకున్న కొద్దిపాటి గౌరవాన్ని కూడా పోగొట్టుకోవద్దు” అని జగ్గారెడ్డి హితవు పలికారు.
Post Views: 152








