Mahaa Daily Exclusive

  సాగునీటి వాటా కోసం ఆయన పోరాటం స్పూర్తిదాయకం: కేటీఆర్

Share

సాగునీటి వాటా కోసం ఆర్ విద్యాసాగర్ రావు చేసిన పోరాటం స్పూర్తిదాయకమని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, తొలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా పనిచేసిన విద్యాసాగర్ రావు వర్థంతి సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న వివక్షను, జల దోపిడీని ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించిన మేథావి విద్యాసాగర్ రావు అని కొనియాడారు.