Mahaa Daily Exclusive

  ఆమనగల్ మార్కెట్ యార్డులో రైతులకు మంచినీటి సౌకర్యం కల్పించాలి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ల రవీందర్…!

Share

ఆమనగల్ మార్కెట్ కమిటీలో మంచినీటి, విద్యుత్ సమస్యలు పరిష్కారం కోసం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ల రవీందర్ ఆమనగల్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శంకర్ నాయక్ కు వినతి పత్రం అందజేచేయడం జరిగింది. ఆమనగల్ మార్కెట్ యార్డ్ లో తాగు నీటి సమస్య ఉందని అదేవిధంగా విద్యుత్ స్తంభాలకు వీధిదీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి రైతులు ధాన్యం విక్రయాల కోసం వచ్చే వారికి కనీస మంచినీటి సమస్యను తక్షణమే కల్పించాలని, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ల రవీందర్ కమిషనర్ ను కోరారు.