ఇందిరమ్మ ఇళ్ళ కోసం అర్హులైన ఇల్లు లేని నిరు పేదలను గుర్తించాలని స్పెషల్ సెక్రెటరి హౌసింగ్ డిపార్ట్మెంట్ విపి గౌతమ్ ఐఏఎస్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా తుక్కుగూడ మున్సిపాలిటీలో మంగళవారం 8వ వార్డ్ మంఖాల్,10వ వార్డు తుక్కుగూడ, మహేశ్వరం మండలం, సిరిగిరిపూర్ గ్రామంలో, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల యొక్క ఎంపిక జరుగుతున్న తీరు మరియు ఇంత వరకు సేకరించిన లబ్ధిదారుల వివరాలు ఇంటింటికి తిరిగి తనిఖీ చేసారు. ఈ సందర్బంగా స్పెషల్ సెక్రెటరి లబ్దిదారులతో మాట్లాడం జరిగినది. ఇట్టి పరిశీలనలో లబ్దిదారుల యొక్క కుటుంబ ప్రస్తుత నివాస స్థితిగతులు, వారి ఆర్థిక పరిస్థితులు మరియు లబ్దిదారుల ఎంపిక వివరాల గురించి తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్బంగా స్పెషల్ సెక్రెటరి విపి గౌతమ్ ఐఏఎస్ మాట్లాడుతూ… నిజమైన లబ్దిదారులని ఇంటి దగ్గరే అధికారులు వచ్చి వాళ్ళ వివరాలను సేకరించి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా అర్హులైన ఇల్లు లేని పేద వారిని గుర్తించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ ఐఏఎస్ (ఎల్బిఎస్) పాల్గొని మాట్లాడుతూ… ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి ఖచ్చితమైన సర్వే చేసి ప్రభుత్వానికి మరియు జిల్లాకి మంచి పేరు తీసుక రావాలని అధికారులను ఆదేశించారు. ఇట్టి కార్యక్రమలో హౌసింగ్ రంగా రెడ్డి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ధరావత్ చంప్లా నాయక్, తుక్కుగూడ మున్సిపాలిటీ కమిషనర్ ఎ వాణి, మహేశ్వరం మండలం తాసిల్దార్ టి సైదులు, మహేశ్వరం మండలం ఎంపీడీఓ కె శైలజ రెడ్డి, వెరిఫికేషన్ ఆఫీసర్ రామ్ ప్రసాద్ వెరిఫికేషన్ ఆఫీసర్ మరియు మునిసిపల్, మండల సిబ్బంది పాల్గొన్నారు








