Mahaa Daily Exclusive

  నేడే మేళ్లచెరువులో భూ భారతి అవగాహన సదస్సు తహశీల్దార్ పి.జ్యోతి..!

Share

మేళ్లచెరువు మండల కేంద్రంలో భూభారతి చట్టంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ పి.జ్యోతి తెలిపారు. శ్రీ కస్తూరి వెంకటేశ్వర కళ్యాణ వేదికలో జరిగే భూభారతి చట్టంపై జరిగే అవగాహన సదస్సుకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్ పాల్గొననున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టంపై జరిగే అవగాహన సదస్సుకు హుజూర్నగర్ నియోజకవర్గం అధికారులు మరియు మేళ్లచెరువు మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొoటారని తహశీల్దార్ తెలిపారు. మేళ్లచెరువు మండల రైతులు ఈ యొక్క సదస్సులో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తహశీల్దార్ కోరారు.