మణుగూరు, మహా ;కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను నిలుపుదల చేయాలని సింగరేణి పరిరక్షణకు కొత్త గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) మణుగూరు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మణుగూరు ఏరియా పీకే ఓసి సెక్షన్-2 లో బ్రాంచ్ కార్యదర్శి వల్లూరు వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన పిట్ మీటింగ్ లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను నిలుపుదల చేయాలని,దక్షిణాది పరిశ్రమలకు ఆయువుపట్టుగా ఉండి ప్రత్యక్షంగా,పరోక్షంగా లక్షల మందికి అన్నం పెడుతున్న సింగరేణి పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు.కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపంగా పరిణమించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షించుకోవాలన్నా సింగరేణి సంస్థను రక్షించుకోవాలన్న కార్మికులను కట్టు బానిసలుగా మార్చనున్న లేబర్ కోడ్ లను నిలుపుదల చేయాలన్న ఐక్య పోరాటలే శరణ్యమని మే 20 తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో రాజకీయాలకతీతంగా ప్రతి సింగరేణి కార్మికుడు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలపాలని ఆయన కోరారు. కార్యక్రమంలో భాగంగా పహల్గాం మృతులకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు టెర్రరిస్టుల ఘాతుకాన్నీ ఖండించారు. కార్యక్రమంలో మణుగూరు నాయకులు ఎం లక్ష్మారావు, సుమన్,సత్రపల్లి సాంబశివరావు,కొడిశాల రాములు, సాయి కృష్ణ, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.








