మణుగూరు,మహా ; సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రభావిత పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.వైద్య శిబిరంలో 105 మందికి వైద్య పరీక్షలు చేసిన ఏరియా ఆసుపత్రి వైద్యులు ఇన్నయ ఉచితంగా మందులను అందజేశారు.కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ సలగల రమేశ్ బాబు,మణుగూరు ఓ.సి మేనేజర్ బైరెడ్డి వెంకటేశ్వర్లు, సేఫ్టీ అధికారి ఆర్.భాస్కర్ రావు,స్టాఫ్ నర్స్ అనంత లక్ష్మి, సిబ్బంది నాగసాయి తదితరులు పాల్గొన్నారు
Post Views: 42








