Mahaa Daily Exclusive

  మేడే కానుకగా సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు శుభవార్త చెప్పాలి ఇఫ్టూ ఆధ్వర్యంలో జిఎం కార్యాలయం వద్ద ధర్నా..!

Share

మేడే కానుకగా సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో నెంబర్ ఇరవై రెండు గెజిట్ చేసి అమలు చేయాలనీ, లేదా హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని కోరుతూ మంగళ వారం సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో మణుగూరు ఏరియా కాంటాక్ట్ కార్మికులు జిఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఏరియా ఇన్ చార్జి ఎస్ ఓ టు జి ఎం డి. వెంకట రామారావు కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ డి నాసర్ పాషా మాట్లాడుతూ… సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి వేతనాల పెంపుకై వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితనీ గొర్రె తోక బెత్తెడు అన్నట్లుగా వేతనాలు పెరగక నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశం అంటుతున్న నేటి తరుణంలో వేతనాల పెంపు అనివార్యం అని రేపు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ జీవో నెంబర్ 22 గెజిట్ చేసి అమలు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు శుభవార్త చెప్పాలని ఆయన కోరారు. అదేవిధంగా బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులను, మక్ క్లీనింగ్ కాంట్రాక్ట్ వర్కర్లను సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు అమలు చేయాలి, సివిల్ మేస్త్రిలను స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలి,ప్రతి నెల 7వ తేదీ కల్లా వేతనాలు చెల్లించాలి ,కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబ సభ్యులందరికీ ఈఎస్ఐ వైద్య సౌకర్యం కల్పించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు పిఎఫ్ లెక్కలు చూపాలి పెండింగ్ పెన్షన్ అమలు చేయాలి రక్షణ పరికరాలు యూనిఫామ్ ఇవ్వాలని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు అందరికీ కామన్ యూనిఫామ్ ఖాకీ ఇవ్వాలని సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ కాంటాక్ట్ కార్మికులందరినీ సింగరేణి కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించి సంక్షేమ పథకాలు వేతన పెంపు అమలు చేయాలని కోరారు