Mahaa Daily Exclusive

  కార్మికులకు శాపంగా మోడీ సర్కార్ కూసుమంచి లో ఇప్టూ ఆధ్వర్యంలో ర్యాలీ..!

Share

కూసుమంచి, మే 1, మహా:

కార్మిక వర్గానికి కట్టు బానిసత్వనికి గురిచేసే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్, బిజెపి సర్కార్ తెచ్చే లేబర్ కోడ్ల రద్దుకై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని బారత కార్మిక సంఘాల ఇప్ప్టూ, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ లు 139వ,మేడేని ఘనంగా నిర్వహించారు. అనంతరం మూడు సెంటర్లలో కార్మిక జేండా ను గ్రామపంచాతి వర్కర్స్ యూనియన్ నాయకులు కొక్కిరేణి వెంకన్న, ఇప్టూ కూసుమంచి మండల కార్యదర్శి గోపె రవి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జేండాను పార్టీ సీనియర్ నాయకుడు మాతంగి రామస్వామి ఎగురవేశారు. ఈసందర్బంగా కాంపాటి మధు అద్యక్షతన జరిగిన సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బజ్జూరి వెంకట్రామిరెడ్డి, జిల్లా నాయకులు కలకొండ సురేష్, డివిజన్ నాయకులు మాతంగి రామస్వామి, చేరుకుపల్లి వీరయ్య లు మాట్లాడుతూ దేశంలో బిజేపి ప్రభుత్వం దేశభక్తి, స్వదేశీ, జాతీయత, మేక్ ఇన్ ఇండీయా, అచ్చే దిన్, వికసిత్ భారత్ వంటి నినాదాలతో ప్రభుత్వరంగం సహా సహజ వనరులను, దేశ సంపదను కారుచౌకగా స్వదేశి, విదేశి కార్పొరేట్ సంస్థలకు మోడీ కారుచౌకగా కట్టబెడుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బిజెపి అధికారంలోకి వచ్చినంక ఫాసిస్టు పాలన కొనసాగిస్తుందని అన్నారు. ఈకార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు పోకల వెంకన్న,గోపయ్య, మల్లెపైన అశోక్ రాంబాబు నరేష్ గోపయ్య సత్యం కే నాగేశ్వరావు ఎం రమేష్ సురేష్,నాగన్న,లింగ,వీరనాగులు ,దాట్ల నాగేశ్వరరావు, బత్తుల ఉప్పయ్య,దోమల వెంకన్న, బత్తుల రాంబాబు, రమేష్, పోటు లక్ష్మయ్య,నోముల రంగారావు,పడిశాల మైసయ్య తదితరులు పాల్గొన్నారు.