కూసుమంచి, మే 1, మహా:
139 వ మేడే సందర్భంగా.. గురువారం కూసుమంచి మండల పరిధిలోని, గైగోళ్ళపల్లి, లాల్ సింగ్ తండా, తుమ్మల తండా గ్రామాలలో సీపీఐ, ఏఐటీయూసీ మండల శాఖల ఆధ్వర్యంలో, మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.. తొలుత మూడు గ్రామాలలో సీపీఐ, ఏఐటియుసి నాయకులు ఎర్రజెండాలను ఎగురవేసి, గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి భూక్యా నరసింహ మాట్లాడుతూ… భారతదేశంలో 1920 వ సంవత్సరంలో పార్టీ ఆవిర్భావానికి ముందే కార్మిక వర్గ హక్కుల కోసం, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా అనేక చారిత్రాత్మక పోరాటాలను ఏఐటీయూసీ నిర్వహించిందని అన్నారు. అనంతరం ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి గుండేపంగు మల్లేష్ మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను హరిస్తుందని ఆరోపించారు. వెంటనే నాలుగు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సీపీఐ మండల కమిటీ సభ్యులు సంగబత్తుల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజ పురోగతి, సంపద సృష్టిలో కార్మికుల కీలకపాత్ర వహిస్తున్నారని, కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కార్మికులను చిన్నచూపు చూస్తుందని, 138 సంవత్సరాలుగా కార్మిక చట్టాలను ఏఐటియుసి కాపాడుకుంటూ వస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహయ కార్యదర్శి జిల్లా లింగయ్య, శాఖా కార్యదర్శి తేలు పిచ్చయ్య, నాయకులు పాండు రంగా చారి, అల్లి వెంకటేశ్వర్లు, తురక వీరయ్య, అల్లి లింగయ్య, పెద్ద లింగయ్య, అంజయ్య, జిల్లా నాగరాజు, చెరుకుపల్లి మల్సుర్, జిల్లా శంకర్, గుండేపాంగు వెంకన్న, జిల్లా లచ్చయ్య, జిల్లా గురవయ్య, కుమ్మరికుంట్ల ఉపేందర్, కోరట్ల సత్యం, భూక్యా సురేష్, తెలంగాణ గిరిజన సంఘం మండల కార్యదర్శి వీరన్న నాయక్, సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి గూడెపు మధు తదితరులు పాల్గొన్నారు.








