Mahaa Daily Exclusive

  ఘనంగా మే డే ఉత్సవాలు ..!

Share

తల్లాడ, మే, 1( మహా):
తల్లాడ మండలంలో పలుచోట్ల 139 వ మేడే సందర్భంగా కార్మిక జండాల ఎగరవేసిన కష్టజీవులు కార్మికులు కర్షకులు తల్లాడ సిపిఎం ఆఫీసు వద్ద పార్టీ మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వర రావు జండా ఎగరవేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల జెండా కష్టజీవుల తమ హక్కుల కోసం సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు పోరాటంలో మరణించిన కార్మికుల రక్తం నుండి వచ్చిన జెండా అని అమెరికా తన సామ్రాజ్యవాద అణచవేతలో చికాగో నగరంలోని హే మార్కెట్లో 18 గంటల పనికి వ్యతిరేకంగా జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణ త్యాగాల ఫలితంగా 8 గంటల పని హక్కును పొందారని కార్మికుల పోరాటాల ఫలితంగా అనేక చట్టాలు వచ్చాయని మనదేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా కార్మికుల హక్కులను కాలరాస్తూ ఎనిమిది గంటల పని స్వస్తి పలికేలా కాంట్రాక్టు పద్ధతిని తీసుకొచ్చి కార్మికుల పోరాడి సాధించుకున్న నాలుగు చట్టాలను 44 కోడ్ లుగా విభజించి నిర్వీర్యం చేస్తుందని రైతు సంఘాల ఆధ్వర్యంలో 13 నెలల పాటు జరిగిన పోరాటంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కర్షకుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి పరిశ్రమలను ప్రైవేటు సంస్థలకు చౌకగా అమ్ముతుందని ప్రభుత్వ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడును ఆహ్వానించి కార్మికులకు నష్టం చేసే పని చేస్తుందని ప్రజల మధ్య కులాల మతాల పేరుతో చిచ్చు పెట్టి విభజించి పాలించే ప్రయత్నం చేస్తుందని దీన్ని మనం అందరం దేశంలో ఉన్న 90 శాతం కష్టజీవులు ఐక్యంగా పోరాడి పూర్వీకులు సాధించి పెట్టిన హక్కులను కాపాడుకోవడం కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని అన్నారు ప్రస్తుతం పెట్టుబడిదారీ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయని సోషలిస్టు దేశాలు దీటుగా ఎదుర్కొంటున్నాయని భవిష్యత్తులో మనమందరం ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎర్రజెండా కార్మిక ఎజెండా పక్షాన పోరాడి మన హక్కులను మన దేశాన్ని కాపాడుకోవలసిన అవసరం మనందరి మీద ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నల్లమోతు మోహన్ రావు షేక్ మస్తాన్ ముచ్చింతల చెన్నయ్య సత్తెనపల్లి నరేష్ చల్లా నాగేశ్వరరావు తమ్మిశెట్టి శ్రీనివాసరావు పులి వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు