Mahaa Daily Exclusive

  ప్రాంగణ నియామకాలలో ఎంపికైన 22 మంది యస్.బి.ఐ.టి. విద్యార్థులు ..!

Share

ఖమ్మం – మహా.
ప్రముఖ కంపెనీ ఎక్స్ప్రెస్ఆర్ సొల్యూష్యన్స్ కు తమ కళాశాలకు చెందిన 22 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన చివరి సంవత్సర విద్యార్థులకు నిర్వహించిన ఎంపికలలో తమ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరచి ఉద్యోగాలు సాధించగలిగారని తెలిపారు. విద్యార్థులు విలువలతో కలిగిన క్రమశిక్షణతో పని చేయాలని దిశానిర్ధేశం చేసారు.

హైదరాబాద్ సైబర్ టవర్స్ కేంద్రంగ నడపబడుతున్న ఎక్స్ప్రెస్ఆర్ సొల్యూషన్స్కు ఫుల్ స్టాక్ డెవలపర్ మరియు క్వాలిటీ అస్యూరెన్స్కు సంబంధించిన ఉద్యోగాలను బుధవారం నిర్వహించామని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్స్ ద్వారా ఎంపికలు నిర్వహించగా ఈ.సి.ఈ., సి.ఎస్.ఈ. కు చెందిన 22 మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు రెండు నెలల పాటు శిక్షణను అందిస్తారని, తదనంతరం వార్షిక ఆధాయంగా 3 నుండి 6 లక్షల వరకు అందుకుంటారని తెలిపారు.

జావా, పైథాన్ వంటి డిమాండ్ ఉన్న కోర్సులతో పాటు సాఫ్ట్వేర్ టెస్టింగ్కు అంతర్జాతీయంగ ఆధరణ ఉందని కళాశాల ప్రిన్సిపాల్ డా॥ జి. రాజ్ కుమార్ తెలిపారు. సాఫ్ట్వేర్ క్వాలిటీ టెస్టింగ్లో సెలీనియంకు మంచి ఆదరణ ఉందని ఎంపికైన విద్యార్థులు ప్రావీణ్యం సాధించడం ద్వారా మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. సి.ఎస్.ఈ. నుండి 17 మంది ఫుల్ స్టాక్ డెవలపర్ గా మరియు ఈ.సి.ఈ నుండి 5 మంది విద్యార్థులు క్వాలిటీ అస్యూరెన్స్ సెలీనియం టెస్టర్గా ఎంపికవడం హర్షణీయం అని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎక్స్ఎల్ఆర్ సాల్యూషన్స్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఆర్. అవినాష్ మరియు హెచ్.ఆర్ శిల్ప తో పాటు కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, డా॥ జె. రవీంద్రబాబు, డా|| యన్. శ్రీనివాసరావు, టి.పి.ఒ. యన్. సవిత, కోఆర్డినేటర్ జి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.