Mahaa Daily Exclusive

  మణుగూరులో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం..!

Share

మణుగూరు, మహా ;మే డే సందర్భంగా మణుగూరు కోర్టు ప్రాంగణంలో గురువారం లీగల్ అవేర్నెస్ పోగ్రామ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సూరి రెడ్డి హాజరయ్యారు. ఈ యొక్క కార్యక్రమంలో కార్మికులను ఉద్దేశించి వారు పడుతున్న శ్రమని కొనియాడారు. వారు సాధించుకున్నటువంటి హక్కులు వారికున్నటువంటి హక్కులు చట్టపరంగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కార్మిక చట్టాల గురించి వారికి వివరించారు. కార్యక్రమంలో మణుగూరు బార్ ప్రెసిడెంట్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, లీగల్ ఎయిట్ కౌన్సిల్ అంకం సర్వేశ్వరరావు,లీగల్ అండ్ మెంబర్స్ పోశం భాస్కరరావు, పద్మావతి, న్యాయవాదులు కందిమల్ల నరసింహారావు,చిర్రా రవికుమార్, చిర్రా సరస్వతి, అన్వేష్, రమేష్, రాము, వాసవి మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.