Mahaa Daily Exclusive

  మేడే” శుభాకాంక్షలు తెలిపిన టిబిజికెఎస్ గౌరవాధ్యక్షురాలు ఎంఎల్సి కవిత ..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, మే 1 (మహా):
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో టి బి జి కె యస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వగృహంలో బి ఆర్ యస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘాల నాయకులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.. దేశ, రాష్ట్ర ప్రగతి కోసం కష్టించి పనిచేస్తున్న శ్రమజీవులకు అండగా నిలబడి వారి సంక్షేమం కోసం హక్కుల సాధన కోసం వారి వెంట నిలబడి నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న ఆయా కార్మిక సంఘాల నాయకుల సేవలను గుర్తించి మే డే దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాలువ కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అందులో భాగంగా టి బి జి కె యస్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ ని కార్మిక వర్గానికి అందిస్తున్న నిస్వార్ధ సేవకు ఆయనకు అరుదైన గౌరవం లభించింది. టి బి జి కె ఏస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి సమక్షంలో టిబిజికెఏస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాలువ కప్పి ఘనంగా సత్కరించి మేడే శుభాకాంక్షలు తెలిపారు. పెట్టుబడి దారి శ్రమ దోపిడీ నుంచి కార్మిక వర్గాన్ని కాపాడాలని మే డే స్పూర్తితో పోరాట వారసత్వం కొనసాగిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చినట్టు ఆయన తెలిపారు.