Mahaa Daily Exclusive

  వేసవి శిక్షణా క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారె.!

Share

దమ్మపేట ,మే1 – మహా :
స్ధానిక మండలంలోని నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణా క్రీడలను అశ్వారావుపేట శాసనసబ్యులు జారె ఆదినారాయణ గురువారం ప్రారంభించారు. పి.ఎం.శ్రీ పధకం ద్వారా ఎంపిక కాబడిన జడ్పీ పాఠశాలలో ఉచితంగా వివిద శిక్షణ లు అందజేస్తున్నారని ,వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా యువజన ,క్రీడలు విభాగం వారి ఆద్వర్యంలో మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో టేబుల్ టెన్నీస్ , వాలిబాల్ ఆటలను ఉచితంగా శిక్షణ అందజేస్తారని తెలిపారు.

ఉచిత కరాటే శిక్షణ :

భద్రాద్రి మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్దానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉచితంగా కరాటే (మార్షల్ ఆర్ట్స్ ) శిక్షణ అందజేస్తున్నట్లు పాఠశాల పి.డి. మల్లేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉత్తమ కరాటే మాష్టర్ అవార్డు గ్రహీత ,రాష్ట్ర సీనియర్ కరాటే మాష్టర్ శేఖర్ ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 4 వ తేది నుండి జూన్ 4 వ తేది వరకు నెల రోజుల పాటు శిక్షణ అందిస్తరని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు సంప్రదించాలని ,శిక్షణ అనంతరం సర్టిఫికేట్ లు కూడా ఇస్తారని తెలిపారు.