దమ్మపేట ,మే1 మహా :
గత మూడు నెలలుగా జీతాలు లేక అర్ధాకలితో విదులకు హాజరవుతున్న జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పదకం ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమం ద్వారా నిరసన చేపట్టారు. మండల కేంద్రంలో ని ఇజియస్ సిబ్బంది ,భద్రాద్రి జిల్లా జేఏసి అద్యక్షులు వేముల సుధాకర్ రావు ఆధ్వర్యంలో ,రాష్ట వ్యాప్తంగా చేసే నిరసన కార్యక్రమంలో గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడు నెలలుగా ఒక్క రూపాయి లేక క్రింది స్ధాయి ఉద్యోగులు సైతం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఫిబ్రవరి 2024లో మంత్రి సీతక్క హామీ ఇచ్చిన పే స్కేలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పెన్ డౌన్ కార్యక్రమం రెండవ రోజుకు చేరుకోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచి పోయాయని , డిమాండ్ లు తీర్చక పోతే నిరసన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఎసి కోశాధికారి పట్నాయక్ ,కంప్యూటర్ ఆపరేటర్ సత్యనారాయణ ,టిఏ బాలస్వామి ఉన్నారు.








