దమ్మపేట ,మే 1 మహా :
మండల పరిదిలోని వ్యవసాయ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రవికుమార్ గురువారం పరిశీలించారు. రైతులు వరి పంటను సకాలంలో కోత కోయాలన్నారు. ధాన్యంలో తేమ శాతం 17 వచ్చేంతవరకు ఆరబెట్టాలని ,తర్వాత ప్యాడీ క్లీనర్ ల ద్వారా తూర్బార పట్టి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని సూచించారు. వరి పంట లు వేసిన రైతులు మీ ఏఇఓ ను సంప్రదించి ,వరి టోకెన్ వ్రాయించుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శీలం చంద్రశేఖర్ రెడ్డి , ఏఇవో వినోద్ ,అనుబాబు ,రైతులు పాల్గొన్నారు.
Post Views: 27








