Mahaa Daily Exclusive

  భీభత్సం సృష్టించిన ఈదురు గాలులు నెలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లు..!

Share

కారేపల్లి, మహా ,

కారేపల్లి మండలంలో బుధవారం రాత్రి వీచిన ఈదురు భీభత్సన్ని సృష్టించారు. ఈదురు గాలులతో పెద్ద చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో విద్యుత్‌, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్గింది. గిద్దవారిగూడెంలో పెద్ద చెట్లు విరిగాయి. రెండు విద్యుత్‌ స్తంబాలు నెలకొరిగాయి. కారేపల్లి క్రాస్‌ రోడ్‌లో భూక్యా శంకర్‌ కు చెందిన ఐదెకరాల బొప్పాయితోట ఈదురు గాలులలు నెలకొరిగింది. చేతికి వస్తున్న దశలో తోట ధ్వంసం కావటంతో రైతు దిక్కుతోచని స్ధితిలో ఉన్నాడు. తనకు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కారేపల్లి`కారేపల్లి క్రాస్‌ ప్రధాన రహదారివెంట చెట్లు విరిగి విద్యుత్‌ తీగలపై పడటంతో విద్యుత్‌ తీవ్రంగా శ్రమించి వాటిని తొలగించి విద్యుత్‌ సరఫరాను పునరుద్దించారు. విశ్వనాధపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్ధార్‌ సంపత్‌కుమార్‌ సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో పూర్తి రక్షణ చర్యలు చేపట్టటంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు