Mahaa Daily Exclusive

  ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన క్రీడా వసతుల ఏర్పాటు…. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్…!

Share

ఖమ్మం – మహా.
ప్రభుత్వరంగ విద్యా సంస్ధలలో అవసరమైన క్రీడా వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టుతున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

గురువారం కలెక్టర్, రఘునాథపాలెం మండలం వివి. పాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యార్ధులకు నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ కేంద్రం ను సందర్శించారు. పాఠశాలలోని ఫుట్ బాల్ మైదానాన్ని, క్యాంప్ లో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులను పరిచయం చేసుకొని కలెక్టర్ వారితో కాసేపు సరదగా పుట్ బాల్ క్రీడ అడి స్పూర్తినిచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ఓటమి అంచు వరకు వెళ్లి కూడా పట్టుదలతో ప్రయత్నిస్తే చివరికి విజయం సాధించవచ్చనే స్పూర్తి మనకు క్రీడలు ఇస్తాయని అన్నారు. పుట్ బాల్ ఆట మనిషిలోని నైపుణ్యతను, క్రీడాస్ఫూర్తిని చాటుతుందని జట్టులో ఐక్యతను పెంచుతాయని తెలిపారు. విద్యార్ధులు ఎండ తీవ్రతను బట్టి నీరు, ఓఆర్ఎస్ ద్రావణం సేవించాలని నూచించారు.

విద్యార్థులు ఫుట్ బాల్ ప్రాక్టిస్ చేసుకునేందుకు వీలుగా గ్రౌండ్ లెవెలింగ్ చేయడం, ఎర్ర మట్టి వేయడం, ఎటువంటి రాళ్ళు లేకుండా గ్రౌండ్ ను శుభ్రం చేయడం, పిచ్చి మొక్కల తొలగింపు వంటి పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అక్కడ కూర్చోని గేమ్ చూసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మురికి నీరు గ్రౌండ్ లోకి రాకుండా డ్రైయిన్ నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చామని, గ్రౌండ్ లో ఫుట్ బాల్ ప్రాక్టిస్ చేసుకునేందుకు వీలుగా అవసరమైన నెట్స్, క్రీడా సామాగ్రి ఏర్పాటు చేశామని అన్నారు. పూర్తిస్ధాయిలో గ్రౌండ్ లెవెలింగ్ చేసి, అవసరమైన అభివృద్ధి పనుల పది రోజులలోపు మెదలు పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి, యువజన సంక్షేమ అధికారి సునీల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, కోచ్ ఆదర్శ కుమార్, తదితరులు పాల్గొన్నారు.