Mahaa Daily Exclusive

  విశాఖ ఎం.పి భరత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నగర మేయర్ పీలా..!

Share

విశాఖ ,మహా : విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖ ఎంపీ శ్రీభరత్ ను వారి క్యాంపు కార్యాలయంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు గురువారం మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చాన్ని అందించి విశాఖ నగర అభివృద్ధి కై జీవీఎంసీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు..ఈ సందర్భంగా విశాఖ ఎంపీ శ్రీభరత్ అభివృద్ధికి, నగర సుందరీకరణకు జీవీఎంసీకి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇస్తూ నగర మేయర్ గా ఆదర్శ పూరితమైన పరిపాలనను జీవీఎంసీ ద్వారా ఈ విశాఖ నగరానికి అందించాలని కోరుతూ మేయర్ ను విశాఖ ఎంపీ శ్రీభరత్ అభినందించారు.