రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మేడే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐఎన్టియుసి ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, ఈసి శేఖర్ గౌడ్ జెండా ఎగర వేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకుల ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం డిపో సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో మేడే సందర్భంగా ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏసి ఈ సి శేఖర్ గౌడ్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మేడే ప్రపంచ దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, కార్మికుల శ్రామికుల కర్షకులకు 8 గంటల పని దినాలు కల్పిస్తూ, వాళ్ళ యొక్క కష్టసుఖాలను తెలుసుకొని ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వాలు సహకరించాలని తెలిపారు. మే డే సందర్భంగా కార్మికులకు కర్షకులకు శ్రామికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు ఐలయ్య గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ దొంతరమోని రాజు, ఆర్టీసీ కార్మికులు, భాస్కర్, వడ్డేమోని ప్రేమ్ కుమార్, భరత్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.








