Mahaa Daily Exclusive

  కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది – సీఎం రేవంత్ రెడ్డి

Share

షాద్ నగర్,మహా:
రవీంధ్ర భారతిలో నిర్వహించిన మే డే కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యనీస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘మే డే’ సందర్భంగా కార్మికులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కార్మికుల కోసం చేస్తున్న పనులు ముఖ్యమంత్రి వివరించారు. ప్రజా ప్రభుత్వ పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు, దసరా, దీపావళి పండుగలకు ముందే బోనస్‌ చెల్లిస్తున్నట్లు వివరించారు. గల్ఫ్‌ దేశాల్లో పని చేసే తెలంగాణ కార్మికుల సంక్షేమానికి ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కార్మికులెవరైనా ఆయా దేశాల్లో ఏ కారణంతో మరణించినా వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.