మే 7 (మహా)
ఖమ్మం జిల్లా దివ్యాంగ చిన్నారుల మిళిత విద్య సమన్వయకర్త శ్రీ యలగందుల రాజశేఖర్ , మరియు చింతకాని మండల విద్యాశాఖ అధికారి సలాది రామారావు ఆదేశాల మేరకు ఈ వేసవి కాలంలో కూడా ఫిజియోథెరపీ వైద్య శిబిరాన్ని బుధవారం చింతకాని మండల పరిధిలోని ప్రత్యేక అవసరాలు గల వివిధ రకముల శారీరక వై కల్యములు, పాక్షిక పక్షవాతం (సెరిబ్రల్ పాల్సి) వంటి సమస్యలతో బాధపడుతున్న చిన్నారులక చింతకాని మండల ము లోఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరం నిర్వహించారు. దీనికి గాను చింతకాని మండల పరిధిలోని వివిధ గ్రామముల నుండి వివిధ రకములైన శారీరక వైకల్యములు, పాక్షిక పక్షవాతం, నడవడంలోనూ నిలబడడంలోనూ, కూర్చోవడం లోను, ఇటువంటి వివిధ రకములైన సమస్యలతో బాధపడుతున్నబాలబాలికలు వారి తల్లిదండ్రులతో హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ డాక్టర్ జి వసంత, చింతకాని మండల,భవితా కేంద్రం లచ్చగూడెం నిర్వాహకులు కవి కొండల శ్రీనివాసకృష్ణారావు, ఐఆర్పి, భూక్యాదస్లి ఐఆర్పి , పాల్గొన్నారు.








