భీమా రంగంలో కారేపల్లికి చెందిన ఇందుర్తి సురేందర్‌రెడ్డి ప్రతిష్టాత్మక ఎండీఆర్‌టీ అవార్డు దక్కించుకున్నారు. ఏజెంట్‌గా ప్రభుత్వ రంగ సంస్ధ లైప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అధికంగా పాలసీలను చేసి ఆరోవసారి ఎండీఆర్‌టీగా ఎంపికైనాడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్ల తో జరిగే మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ (ఎం.డి.ఆర్.టి) సమావేశానికి కొత్తగూడెం బ్రాంచ్ నుండి గత ఆరు సంవత్సరాలుగా అర్హత సాధించిన సందర్భంగా ఎల్‌ఐసీ వరంగల్ డివిజన్ ఆధ్వర్యంలో వరంగల్‌లో బుధవారంఏర్పాటు చేసిన కార్యక్రమంలో సురేందర్‌రెడ్డిని వరంగల్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్లు కె.సుధాకర్‌బాబు, ఎం.సుబ్రహ్మణ్యన్, మార్కెటింగ్ మేనేజర్ ఎన్.గోపాలకఅష్ణ లు సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
Post Views: 36








