Mahaa Daily Exclusive

  సాంకేతికతపై రైతులకు అవగాహన సదస్సులు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో రాములు నాయక్..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా పోలికపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. శంకర్ పల్లి మండలం, పోలికపల్లి గ్రామంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఎం విద్యాదరి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి అగ్రికల్చర్ కమిషన్ మరియు వెల్ఫేర్ మెంబర్ సభావత్ రాములు నాయక్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ… రైతులు వ్యవసాయంలో పాటించవలసిన సాంకేతికపై అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి శాస్త్రవేత్తలు వచ్చి అవగాహన కల్పిస్తారని, వారు చెప్పే సూచనల ప్రకారం నాణ్యమైన విత్తనాలను వేసుకొని, ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసి అధిక దిగుబడితో రైతు లాభాలను పొందాలని, లాభదాయకమైన పంటలను వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు సృజన, వై శ్రావణ్, పంచాయతీ సెక్రెటరీ రాధా, Dr వి సునీత, Dr ఎస్ శ్రీనివాస్ రెడ్డి, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.