Mahaa Daily Exclusive

  కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ మైనారిటీ గురుకులలు. ఆర్ ఎల్ సి కనపర్తి సురేష్ కుమార్…!

Share

కరీంనగర్, మహా :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ గుకులల్లో కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని మైనారిటీ గురుకుల ఆర్ ఎల్ సి కనపర్తి సురేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అస్లాం మజీద్ దగ్గర మైనారిటీ గురుకుల పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఉపాధ్యాయ బృందo తో కలిసి అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజం లో అల్ప సంఖ్యాకులు అందరితో సమానంగా ఎదగడానికి గురుకులాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. కరీంనగర్ బాయ్స్ 2 ఇరుకుల్ల పాఠశాల యందు 5,6,7,8,9వ తరగతులలో మరియు ఇంటర్మీడియట్ MEC మరియు CEC కోర్సులలో ముస్లిం మైనారిటీ విద్యార్థులకు అవకాశం కలదు అని తెలియజేస్తూ, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, నోట్ బుక్స్ లతో పాటు పౌష్టిక ఆహారం అందిస్తుండటం జరుగుతుందని అన్నారు. ఉన్నత అర్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయని అన్నారు. ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో గురుకుల పాఠశాలలు 100 శాతం ఉత్తిర్ణత సాధించాయని, ఇక్కడ ఉపాధ్యాయుల సామర్థ్యనికి ఈ ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు ముక్యంగా మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా గురుకులాల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురుంచి వివరించడానికి వస్తువుల ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సంవత్సరం నుండి ఐఐటీ మరియు నీట్ ఫౌండేషన్ 8 వ తరగతి నుండి ప్ర రంబించున్నమన్నారు.
ఈ కార్యక్రమం లో స్కూల్ కో ఆర్డినేటర్ మహేందర్, కాలేజ్ కో ఆర్డినేటర్ రాజు, నగేష్,అధ్యాపకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.