Mahaa Daily Exclusive

  జిల్లా విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి మంద శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి..!

Share

హన్మకొండ మహా;

హనుమకొండ జిల్లా కేంద్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తూ పేద విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్న హన్మకొండ జిల్లా విద్యాశాఖ అధికారులు డీఈవో, డి ఐఈఓ లను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ హన్మకొండ నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోనీ గెస్ట్ హౌస్ లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హన్మకొండ నగరంలో జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించకుండా ప్రైవేట్ కార్పొరేటు స్కూల్స్ ప్రైవేటు కార్పొరేటు జూనియర్ కళాశాలలు నగరంలో పెద్దపెద్ద హోల్డింగ్లు ఏర్పాటు చేస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తూ విచ్చలవిడిగా సమ్మర్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తూ వారి దగ్గర నుంచి వేల రూపాయల నుండి లక్షల్లో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఈ విషయంపై స్థానిక విద్య శాఖ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన స్పందించడం లేదని కనీసం అధికారులు అందుబాటులో ఉండడం లేరని కనీసం ఫోన్లోనైనా సమస్యలను చెబుదామంటే కూడా ఫోన్ చేస్తే కూడా స్పందించడం లేదన్నారు. హనుమకొండ నగరంలో కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా స్కూల్స్ ను ప్రారంభం చేసి అక్రమంగా అడ్మిషన్లు చేర్చుకుంటున్నారు. అలాగే హనుమకొండ నగరంలో ఐఐటి అకాడమీల పేరుతో సంస్థలను నిర్వహిస్తూ ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా అందులోనే జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసుకొని విద్యార్థులను చేర్చుకుంటూ అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ వారి సంస్థలను నడిపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని మేము అడుగుతున్నామన్నారు వెంటనే ఈ విషయంపై స్థానిక జిల్లా కలెక్టర్ స్పందించి అధికారులను సస్పెండ్ చేసి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా నడుపుతున్న ప్రైవేట్ కార్పొరేటు విద్య సంస్థలను ముసివేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు మల్లేష్, పవన్, అజయ్, భరత్, సాయికుమార్, తదితరులు, పాల్గొన్నారు.