వరంగల్ మహా;
ప్రభుత్వ పథకాల పరిశీలనలో వేగం పెంచాలని బల్దియా కమీషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. శుక్రవారం డిప్యూటీ కమిషనర్ లతో రేషన్ కార్డ్ విచారణల ఇందిరమ్మ ఇళ్లు రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తుల పురోగతిపై సమీక్ష నిర్వహించి సమర్థవంతం నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక లో భాగంగా క్షేత్ర స్థాయిలో పరిశీలనలు చేసి ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ల లాగిన్ లోకి పంపించాలని కొత్త గా దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల సర్వే మొదలు పెట్టాలని రాజీవ్ యువ వికాసం కు వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి సిబిల్ స్కోర్ కోసం బ్యాంకులకు పంపించాలని కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రవీందర్, రాజేశ్వర్, తదితరులు, పాల్గొన్నారు.
Post Views: 18








