Mahaa Daily Exclusive

  మురళి నాయక్ సచిన్ యాదవ్ జవాన్లకు అశ్రు నివాళి..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మానుకోకపోతే భారత దేశం నుండి కోలుకోలేని దెబ్బ తప్పదని ప్రపంచ పఠంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా పోతుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆమనగల్ మండలం, మైసిగండి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ హీరా సింగ్ నాయక్ ఆధ్వర్యంలో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో జవాన్లు అసువులు బాసి వీర మరణం పొందడం బాధాకరం అని, ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం సరిహద్దుల్లో ఉంటూ, మన అందరి రక్షణ కోసం పాకిస్తాన్ సైనికులతో, ఉగ్రవాదులతో పోరాడుతూ తమ ప్రాణాలు వదిలిన అమర వీరులు జవాన్లకుమురళి నాయక్ సచిన్ యాదవ్ జవాన్లకు అశ్రు నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్న జవాన్లకు మద్దతుగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం వీర జవాన్ల చిత్రపటాలకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పిసిసి సభ్యులు ఆయిల్ల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… నిత్యం శాంతి కోరే భారతదేశం పై పాకిస్తాన్ ఎప్పుడు కవ్వింపు చర్యలు పాల్పడుతూ ఉగ్రవాదాన్ని పోషిస్తూ, ప్రజల పైన దేశం పైన దాడులు చేస్తూనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశమంతా ఏకమై సైనికులకు, భారత ప్రభుత్వానికి అండగా నిలిచిందన్నారు. ప్రపంచ దేశాలు సైతం పాకిస్తాన్ ఆగడాలను, కవింపు చర్యలను ఎండగడుతూ భారతదేశానికి మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. పాకిస్తాన్ ఇలానే వ్యవహరిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా పోతుందని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. దేశ ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు భారత ప్రభుత్వానికి సైనిక మిలిటరీకి పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఈ దేశ భద్రత కోసం ఏ సమయానైనా మద్దతుగా నిలబడడానికి ప్రతి వ్యక్తి సంసిద్ధంగా ఉన్నారన్నారు. అరగంటలోనే ఇద్దరు మహిళలు కల్నాల్ సోఫీయా ఖురేసి, వింగ్ కామండర్ వ్యోమిక సింగ్, పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి, ఉగ్రవాద శిబిరాలను నెలామట్టం చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసి, వందల మందిని క్షతగాత్రులను చేసిన విషయం మరిచి పాకిస్తాన్ కయ్యానికి రావడం సిగ్గుచేటు అని అన్నారు. చైనా నుంచి తెచ్చుకున్న JF 17 ను భరత్ ప్రయోగిస్తే, దానికి భరత్ దీటుగా SD 400 డిఫెన్స్ సిస్టమ్ తో ఆకాశంలోనే ధ్వంసం చేసిన విషయాన్నీ మరవద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సభవత్ బిచ్య నాయక్, తాలూకా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గాదెమోని దళపతి గౌడ్, జవహర్ లాల్ నాయక్, స్టాలిన్, కిషన్ నాయక్, తులసిరామ్ నాయక్, బోని శంకర్, కిషన్, నరసింహ గౌడ్, జగన్ ప్రవీణ్ , సీతారాం, బాబూలాల్, ఆంజనేయులు, దేనా నాయక్, హిందీ నాయక్, హర్యానాయక్, మల్యా నాయక్, మహిళ మహిళలు యువకులు పాల్గొన్నారు.