రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య… బంగారు భవిష్యత్తు ఉంటుందని, బడిబాట కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగి విద్యార్థులను కలిసిన ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పాఠశాల విద్యాశాఖ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపట్నం ప్రధానోపాధ్యాయులు వెంకట రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు పొగాకు సురేష్ శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని పాత బస్టాండ్ పరిసర ప్రాంతాలు, జంగాల బస్తి ప్రాంతాల్లోని చాలా ఇళ్లను సందర్శించి, విద్యార్థుల తల్లిదండ్రులను కలవడం జరిగింది. పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులను గురించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పాఠశాలలో ప్రారంభిస్తున్న విషయం గురించి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క అర్హతల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. వారి పిల్లల బంగారు భవిష్యత్తుకై పాఠశాలలో చేర్పించాల్సిందిగా కోరడం జరిగింది. చాలామంది తల్లిదండ్రులు పాఠశాలలో విద్యనందిస్తున్న తీరుపట్ల పాఠశాల పట్ల సానుకూలంగా స్పందించి, తమ పిల్లల్ని పాఠశాలలో చేర్పించడానికి సుముఖత వ్యక్తం చేశారని వారు తెలిపారు. ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో 90% ఉత్తీర్ణత రావడం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షల్లో పాఠశాల నుండి 11మంది విద్యార్థులు ఎంపిక కావడం, ఎటిఎం ల్యాబ్ లో గ్రాండ్ మాస్టర్ ఛాలెంజ్ అవార్డు గెలుచుకోవడం, విద్యార్థులు ఆటల పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం లాంటి ఎన్నో అంశాల్ని తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఎన్నో సౌకర్యాల అందించడంతో పాటు, నాణ్యమైన రెండు జతల ఎకరూప దుస్తులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం గురించి వారు వివరించారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న సువిశాలమైన తరగతుల గదుల గురించి, అన్ని రకాల కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ యొక్క సౌకర్యాలు గురించి క్షుణ్ణంగా తల్లిదండ్రులకు వివరించగా వారు సంతృప్తి వ్యక్తం చేసి ఈ సంవత్సరం విద్యార్థులని అధిక సంఖ్యలో చేర్పించడానికి సంసిద్ధత వ్యక్తించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు వెంకట రెడ్డి తెలిపారు.








