Mahaa Daily Exclusive

  ప్రైవేట్ స్కూల ఫీజుల దోపిడీని అరికట్టాలి మండల విద్యాధికారికి ఫిర్యాదు టిఎస్ఎస్ఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీసాల వంశీ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మండలంలో ప్రైవేట్ స్కూల్ లలో ఫీజుల దోపిడీని అరికట్టి, అనుమతిలేని స్కూల్లపై చర్యలు తీసుకోవాలిటిఎస్ఎస్ఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీసాల వంశీ అన్నారు. తలకొండపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, బట్టలు, పెన్నులను విద్యా సంవత్సరం ప్రారంభమౌతున్న సమయంలో విచ్చలవిడిగా దందాను కొనసాగిస్తారు. వాటిపై చర్యలు తీసుకునే విధంగా, దానిపైన వెంటనే టాక్స్ ఫోర్స్ వేసి ప్రవేట్ స్కూల్ లను తనిఖీ చేసి వాటిపై చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారి ఎంఈఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. పేద మధ్య తరగతి ప్రజలను మభ్యపెట్టి లక్షల రూపాయలు ఫీజులను దోచుకుంటున్న ప్రైవేట్ పాఠశాలలను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మండల కమిటీ సభ్యులు తుమ్మ నితీష్ వర్మ, శ్రీకాంత్, ఎస్ సి ఆర్ పి ఎఫ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వాటం శ్రీశైలం, టి ఎస్ ఎస్ ఓ కమిటీ సభ్యులు శ్రీకాంత్, సందీప్,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.