కూసుమంచి, మే 9, మహా:
హ్యాపీ బర్త్డే టూ యు మారియా అంటూ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి గ్రామానికి చెందిన మారియాకు రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మారియా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ సాదిక్ ఆలీ సారథ్యంలో శుక్రవారం హైదరాబాద్ లోని సచివాలయం లో రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన చాంబర్లో కేక్ కట్ చేయించి బర్త్ డే విషెస్ తెలిపారు. మారియా రైఫిల్ శిక్షణలో భాగంగా అందుకు కావలసిన మౌలిక వసతులు, రైఫిల్ కొనుగోలు ఆర్థిక అంశాలకు చెందిన ఫైలును త్వరిత గతిన వేగవంతం చేసి ఆమె శిక్షణకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు..
అనంతరం మంత్రి పొంగులేటి సయ్యద్ సాదిక్ అలీతో కాసేపు ముచ్చటిoచారు..
ఈ మేరకు రాజ్యాంగ పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ, మారియా తండ్రి ఖదీర్, ఆర్ పి వి సంస్థ నాయకులు ఖలీమ్, మారియా సోదరుడు, ప్రముఖ పిస్తోల్ షూటర్ ఎహ్ సాన్, మంత్రి పొంగులేటికు కృతజ్ఞతలు తెలిపారు…








