Mahaa Daily Exclusive

  వెంకటసాయి నగర్‌లో ప్రారంభమైన గ్రామదేవతల ప్రతిష్ట..!

Share

కారేపల్లి, మహా ,

కారేపల్లి మండలం శ్రీవెంకటసాయినగర్‌లో నూతనంగా గ్రామదేవతల ప్రతిష్టకు కాలనీ వాసులు పూనుకున్నారు. దానిలో భాగంగా శుక్రవారం పూజలను వేదపండితులు ప్రారంభించారు. కాలనీ వాసులతో సామూహిక కుంకుమార్చనలు, హోమాలు జరిపారు. కాలనీలో బడ్రాయి(నాబిశీల), ముత్యాలతల్లి, శ్రీ అంజనేయ స్వామి వార్ల విగ్రహాలను ప్రతిష్టకు కమిటీ అధ్యక్షకార్యదర్శులు చందావత్‌ లక్ష్మన్‌, కల్తి భాస్కర్‌ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈనెల 11వ తేదిన గ్రామదేవతలతో పాటు అంజవేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ట జరపున్నట్లు తెలిపారు. 12వ తేదిన గ్రామదేవతలకు బోనాల సమర్పణ నిర్వహిస్తుమని కమిటీ తెలిపింది. కాలనీ వాసులు కులమతాలకు అతీతంగా ఐక్యంగా గ్రామదేవతల ప్రతిష్టకు చందాలు వేసుకోని నిర్వహించుకోవటంతో కాలనీ వాసులను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. ఈకార్యక్రమంలో కమిటీ సభ్యులు నగేశ్‌, రాంబాబు, రామారావు, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.