Mahaa Daily Exclusive

  గుర్తింపు లేని ప్రయివేటు కళాశాలల పై చర్యలు తీసుకోవాలి ఏ. పి ప్రయివేటు జూనియర్ కళాశాలల అసోసియేషన్ డిమాండ్…!

Share

అనకాపల్లి జిల్లా ,సబ్బవరం మహా : ఉమ్మడి
విశాఖ జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేని ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల జాయింట్ మేనేజ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కే జనార్దన్ రావు అన్నారు.ఎస్.ఎస్.ఎస్.ఎస్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని తెలిపారు.ఆ సమాచారం మేరకు దీనిపై అసోసియేషన్ సభ్యులతో కలిసి విచారణ జరపగా కొన్ని కళాశాలలకు అనుమతులు లేనట్లు గుర్తించమన్నారు.సబ్బవరం లో శ్రీ విషన్ అకాడమీ కళాశాల కు ఎటువంటి అనుమతులు లేనట్లు మా కమిటీ ద్వారా గుర్తించడం జరిగిందన్నారు.శ్రీ విషన్ అకాడమీ కళాశాల నిర్వహకం ను బయటపడిందన్నారు.దీంతో అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి మెయిల్ ద్వారా అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు ,వ్రాత పూర్వకంగా డి.ఐ. ఈ. ఓ కు పిర్యాదు చేశామని తెలిపారు.అనంతరం గుర్తింపు లేని కళాశాలలో చదివించి విద్యార్థుల భవిష్యత్ ను పాడుచేయవద్దని తల్లిదండ్రుల కు వారు సూచించారు.
అనధికారికంగా నిర్వహిస్తున్న ఇటువంటి కళాశాలలో విద్యార్థుల ను చదివించి తమ పిల్లల భవిష్యత్తును పాడు చేసుకోవద్దని పిల్లలను చేర్చే టప్పుడు కలశాలకు అన్ని అనుమతులు ఉన్నాయో లేదో గుర్తించి అన్ని అనుమతులు ఉన్నాయన్న నిర్దారణ చేసుకున్న తరువాతే జాయిన్ చేయాలన్నారు. అలాగే సబ్బవరం మండలంలో గల శ్రీ విషన్ అకాడమీ కళాశాల పై చర్యలు తీసుకోవాల్సిందిగా డి. ఐ ఈ. ఓ సుజాత ను వారు కోరారు దీనిపై స్పందించిన డి ఐ ఈ ఓ తప్పకుండా గుర్తింపు లేని కళాశాలలో పై దర్యాప్తు జరిపించిన అనంతరం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని జనార్దన్ రావు తెలిపారు .
ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు అడపా శేషగిరిరావు ,ఈ. సి మెంబర్ కే నాగేశ్వరరావు ,బీ సెట్టి మురళి ప్రసాద్ ఏ.పీ జె .ఎం. ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కృష్ణమోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు టి మాణిక్యాలరావు, అనకాపల్లి జిల్లా ఏపీజీఎంఏ గౌరవ అధ్యక్షులు పల్లి శేష్కరరావు తదితరులు పాల్గొన్నారు.