Mahaa Daily Exclusive

  మోడీ11 ఏండ్ల పాలన పై మండల సంకల్ప సభ కార్యక్రమం పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని దేశాయిపేట మండలంలో మోడీ 11 ఏండ్ల పరిపాలన పై మండల శాఖ ఏర్పాటుచేసిన సంకల్పంతో సహకారం.. (కారేశాల) మండల సంకల్ప సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోది 11 సంవత్సరాల సుపరిపాలనలో, భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే లక్ష్యంతోనే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పేదలు, రైతులు, మహిళలు, యువకులకు ప్రోత్సాహకరంగా అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాబేటి వెంకట్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బైరి మురళీ, మండల అధ్యక్షులు విప్ప సుధాకర్, జిల్లా కార్యాలయ కార్యదర్శి పెద్ది నవీన్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ వీర్, కార్యాలయ కోకన్వీనర్ మొండ్రాతి వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ కందగట్ల మల్లికార్జున్, డివిజన్ అధ్యక్షులు తోట సురేష్ బిజెపి నాయకులు కొంతం సంగీత్, బల్లకారి రాజు, వంగ సంపత్ తదితర బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.