AP: అక్టోబర్ 2 నాటికి విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం సహా మొత్తం 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సీఎం మాట్లాడుతూ.. ‘వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలి. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలి. 90 రోజుల్లో రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యచరణ ప్రణాళిక ఇవ్వాలి’ అని అధికారులను సూచించారు.
Post Views: 18








