Mahaa Daily Exclusive

  స్థానిక ఎన్నికలలో మరోమారు పట్టు సాధించాలి. సోసైటీ చైర్మన్ గూడవల్లి రాంబ్రహ్మం…!

Share

నేలకొండపల్లి, జూన్ 27 మహా:

స్థానిక సంస్థల ఎన్నికలలో నేలకొండపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ తో పాటు, ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ మరో మారు విజయం సాధించి పట్టు సాధించాలని సోసైటీ చైర్మన్ గూడవల్లి రాంబ్రహ్మం సూచించారు. మండల కేంద్రంలో మంత్రి క్యాంపు కార్యాలయం లో శుక్రవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు…నేలకొండపల్లి మేజర్ పంచాయతీ కాంగ్రెస్ కు కంచుకోట అన్నారు. మంత్రి శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి పనులను ఇంటింటా తిరిగి వివరించాలని సూచించారు. మేజర్ పంచాయతీ సర్పంచ్ పాటు, మూడు ఎంపీటీసీలు భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించేలా పని చేయాలని సూచించారు. ప్రతీ కార్యకర్త -సైనికుల్లా ముందుకు సాగాలని సూచించారు. ఇక నుంచి ప్రతీ రోజుకాంగ్రెస్ పధకాల గురించి విస్త్రుతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. వార్డుల వారీగా ముఖ్యలతో సమావేశం నిర్వహించి, ఎన్నికలకు సిద్ధం చేయాలని పేర్కోన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ గుడిపాటి ముక్కంటి, పార్టీ నాయకులు గుండా బ్రహ్మం, వీరభద్రం, కైలాసపు వెంకటేశ్వర్లు, రాంబాబు, రాయపూడి శ్రీనివాసరావు, తోట వాసు, గోవింద్, పొన్నగాని రాంభాస్కర్, కడియాల నరేష్, కొండలు, వెంకటేశ్వర్లు, బొబ్బూరి శ్రీనివాసరావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.