Mahaa Daily Exclusive

  సీసీ కెమెరాలు ఏర్పాటుకు విరాళం అందజేత..!

Share

నేలకొండపల్లి మండల పరిధిలోని చెన్నారం గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడానికి గాను అదే గ్రామానికి చెందిన ప్రజావేదిక డైలి పేపర్ సిఇఓ గంజికుంట్ల వెంకన్న రూ 25 వేల రూపాయలను నేలకొండపల్లి ఎస్సై పి. సంతోష్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. సిసి కెమెరాలు గ్రామంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అపరిచితుల కదలికలను గుర్తించడానికి దోహదపడతాయన్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి సిసి కెమెరాలను ఎంతోగానోఉపయోగపడతాయన్నారు. చాలా నేరాల్లో నింధితులు దోషులుగా రుజువు కావడానికి సీసీ కెమెరాల సాక్ష్యం ఎంతగానో ఉపయోగపడిందన్నారు.. సీసీ కెమెరాల వల్ల నేరాలు జరుగకుండా నియత్రించినట్లయితే ఇంకా ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి ఉపకరిస్తుంధన్నారు ప్రజల పోలీసుల మధ్య సమన్వయంతో నేరాలు సాధ్యపడుతుందని ఎస్సై తెలిపారు. సీసీ కెమెరాల సాక్ష్యం కోర్టులో చాలా ముఖ్యమని నింధితులు తప్పించుకునే అవకాశం ఉండదని చెప్పారు. ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించినట్లు తెలియజేసారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది కానిస్టేబుళ్లతో సమానమని, 24 గంటలు 365 రోజులు నిర్విరామంగా నిరంతరాయంగా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా గంజికుంట్ల వెంకన్న ను ఎస్సై సంతోష్ తో పాటు గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఎస్కే ఖాసీం, చెన్నారం పిఏసిఎస్ చైర్మన్ చింతనిప్పు సైదులు, చెన్నారం మాజీ సర్పంచ్ ఎస్కే మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.