Mahaa Daily Exclusive

  రఘునాథపాలెం లో పొలం బాట…!

Share

రమణ పాలెం, మహా.
పొలం బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మల్లేపల్లి, గడ్డికుంట తండా, బావోజితండ గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారులు పరిశీలనలు చేపట్టారు. డివిజన్ ఇంజినీర్ (టెక్నికల్), భద్రతా అధికారి, రఘునాథపాలెం ఏడీఈ, మంచుకొండ ఏఈ, విద్యుత్ సిబ్బంది, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వారు గ్రామాల్లోని విద్యుత్ లైన్లు చూసి, ఐదు చోట్ల తక్కువ ఎత్తులో ఉన్న లైన్లు ప్రమాదకరంగా ఉన్నట్టు గుర్తించారు. వెంటనే వాటిని సరిచేయాలని అధికారులకు చెప్పారు.

రైతులకు విద్యుత్ భద్రతపై సమాచారం ఇచ్చారు. సమస్యలు వస్తే 1912 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. బట్టలు ఆరేసే తాళ్లు, ఇన్సులేటెడ్ వైరులు వాడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ పనులు రైతులు చేయకూడదని చెప్పారు.

మోటార్ల వైర్లు పరిశీలించి, మంచి నాణ్యతలో ఉండేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన కలిగింది.