Mahaa Daily Exclusive

  ప్రకృతి వ్యవసాయం వల్ల అనేక లాభాలు ఉన్నాయి: అగ్రికల్చర్ ఏఓ..!

Share

కూసుమంచి, జూన్ 27, మహా:

కూసుమంచి మండలంలోని కొత్తూరు గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూసుమంచి మండలం అగ్రికల్చర్ అధికారి రామడుగు వాణి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వల్ల అనేక లాభాలు ఉన్నాయని, భూమి యొక్క జీవశక్తి పెరుగుతుందని, భూమి నాణ్యత మెరుగుపడుతుందనితద్వారా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం మెరుగుపడుతుందని, నాణ్యమైన కలుషితం కాని ఆహారం లభిస్తుందని తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయంలో జీవన ఎరువులు, గోమూత్రం, వేప సంబంధిత కషాయాలు, వర్మీ కంపోస్ట్, పుల్లటి మజ్జిగ వంటివి ఉపయోగించాలని తెలియజేశారు. అనంతరం అధిక యూరియా వాడకం వల్ల కలిగే అనర్థాలను తెలియజేశారు. నానో యూరియా వాడకం మరియు భాస్వరం కరిగించే బ్యాక్టీరియా గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు సౌమ్య , సాయిరాం మరియు రైతులు పాల్గొన్నారు.