Mahaa Daily Exclusive

  జిఎం (పర్సనల్ )కు సార్వత్రిక సమ్మె నోటీసు అందజేసిన సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నేతలు..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 27 (మహా):
వచ్ఛేజూలై 9 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు పాల్గొంటారని, ముందుగానే చట్ట ప్రకారం తమ ద్వారా సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇస్తున్నామని జిఎం పర్సనల్ కవితా నాయుడుకి సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాసే విధంగా నాలుగు లేబర్ కోడ్ లు తీసుకొచ్చాఎన్నారని అన్నారు. అనేక సంవత్సరాల చరిత్ర కలిగి, కార్మికుల సంక్షేమ కోసం ఏర్పడిన 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ అన్యాయంగా కార్మికులను మోసం చేసే విధానాలను వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చారని వారు తెలిపారు. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పాలన చేస్తున్న ప్రజా వ్యతిరేక బిజెపి విధానాలు అడ్డుకట్ట వేస్తూ జాతీయ కార్మిక సంఘాలు అన్ని ఐక్యంగా ఉద్యమిస్తున్నాయని తెలిపారు. సింగరేణి యాజమాన్యం కార్మిక సంక్షేమం కోసం ఆలోచించి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఎస్.కె షేక్ షా వలి తెలంగాణ జన సమితి కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మల్లెల రామనాథం కాంట్రాక్టు కార్మిక హక్కుల పోరాట సమితి నాయకులు కరుణాకర్ సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు కొత్తగూడెం బ్రాంచ్ నాయకులు భూక్యా రమేష్, గుగులోత సక్రం తదితరులు పాల్గొన్నారు