Mahaa Daily Exclusive

  మమతకు నివాళులర్పించిన నాయకులు అంతక్రియలకు 5వేలు సాయం అందించిన మాజీ సర్పంచ్..!

Share

కారేపల్లి, మహా:మండల పరిధిలోని అప్పయిగూడెం పంచాయితీకి కాంగ్రెస్ నాయకులు పులసం భద్రయ్య సతీమణి పులసం మమత(42) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ అజ్మీర అరుణ, నాయకులు అజ్మీర విరన్న, సొసైటీ డైరెక్టర్ బాణోత్ హిరలాల్ లు మమత పార్ధివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం మాజీ సర్పంచ్ అంతక్రియలకు 5వేలు ఆర్ధిక సహాయం అందించారు. ఈకార్యక్రమంలో నాయకులు అజ్మీర బిచ్చ, మాజీ ఎంపీటీసీ వాంకుడొత్ సుక్య, భూక్యా రాంకి, నందియా నాయక్,దరావత్ దేవీలాల్,గుగులోత్ మోహన్,రమేష్ , వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య ,కృష్ణ, నాగేంద్రబాబు స్థానిక నాయకులు పాల్గొన్నారు.