కారేపల్లి, మహా : సీపీఐ(ఎం) సానుభూతిపరురాలు కారేపల్లి మండలం, బాజుమల్లాయిగూడెంకు చెందిన మోకాళ్ళ లక్ష్మి(62) శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మి ఆరోగ్యం విషమించి మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర, డివిజన్ కమిటీ సభ్యులు వజ్జా రామారావు సందర్శించి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కడవరకు ఎర్రజెండాను వీడక పార్టీ పోరాటాలలో పాలుపంచుకుందన్నారు. ఆమె మృతి కుటుంబానికి, పార్టీకి తీరని లోటన్నారు. నివాళ్లు ఆర్పించిన వారిలో సీపీఐ(ఎం) నాయకులు మన్నెం బ్రహ్మయ్య, మద్దెలనాగయ్య, అజ్మీర శోభన్‌బాబు, వల్లబోయిన కొండలరావు, పోతురాజు చందర్‌రావు, మెరుగు రాములు, ఎస్‌కె.చిన్నసైదులు, మోకాళ్ళ రాములు, కోటేశ్వరరావు, లక్ష్మన్‌రావు, రామారావు, శేరు లలితమ్మ, ఎర్రబోడు మాజీ సర్పంచ్ కుర్సం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.








