Mahaa Daily Exclusive

  ఎమ్మెల్యే నాయిని ని కలిసిన వరంగల్ క్రెడాయ్ నూతన కార్యవర్గం..!

Share

హన్మకొండ మహా;

హనుమకొండ జిల్లాలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖ సంస్థల సమాఖ్య క్రెడాయ్ (CREDAI) నూతన కార్యవర్గ సభ్యులు, శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
ఇటీవల జరిగిన క్రెడాయ్ వరంగల్ చాప్టర్ ఎన్నికల్లో పదవుల్లోకి వచ్చిన నూతన ప్రతినిధులను ఎమ్మెల్యే హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో వారి పాలనతో రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో క్రెడాయి చైర్మన్ అరబెల్లి తిరుపతి రెడ్డి,అధ్యక్షులు నాయిని అమరేందర్ రెడ్డి,ప్రెసిడెంట్ ఎలెక్ట్ కంది శ్రీనివాస్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి శాకమూరి అమర్,ఉపాధ్యక్షులు మందల రవీందర్ రెడ్డి,లెక్కల రజనీకాంత్ రెడ్డి,జాయింట్ సెక్రటరీలు ఎ. కొండా రెడ్డి,ఆలేటి నాగరాజు ,E.C. సభ్యులు రిషిన్ రెడ్డి నూకల,రమేష్ బాబు రామంచ,వెంకటేశ్వర్లు టి,ఏకసాయి కుమార్ చింత, శ్రీనివాస్ నల్లూరి తదితరులు పాల్గొన్నారు.