Mahaa Daily Exclusive

  భూములు పోయినా పరిహారం లేని పాలన . * మున్నేరు నిర్వాసితులను కలిసిన బిజెపి నేతలు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు హెచ్చరిక..!

Share

ఖమ్మం, మహా

భూములు తీసుకుంటూ పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడమంటే… ఇది రాజ్యాంగాన్ని తాకట్టు పెట్టడమే. ఇది ప్రభుత్వ పశుత్వాన్ని స్పష్టంగా చూపించే ఉదాహరణ” అంటూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మండిపడ్డారు. శనివారం రోజున ఖమ్మం నగరంలోని 29,30 డివిజన్లో మున్నేరు నిర్వాసితులను కలిశారు. ఈ సందర్భంగా బాధితులు ఇచ్చిన విజ్ఞపన పత్రాలను స్వీకరించినారు.
మున్నేరు వరదల వల్ల గత ఏడాది సర్వస్వం కోల్పోయిన నేటి వరకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని బాధితులు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులకి విన్నవించుకున్నారు. అంతేకాకుండా మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల వందలాది ఎకరాల భూములు కోల్పోతున్న వాటికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించలేదని బాధితులు గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
“ఇది మా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా ప్రజల మధ్య ఉండే సంకల్పానికి నిదర్శనం. బాధితుల కోసం అవసరమైతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.. వరదల వల్ల బతుకులు బతుకులా లేని స్థితిలో ఉన్న ప్రజలు – తమ భూములు కోల్పోయి నష్టపరిహారాన్ని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కళ్లు మూసుకుని నిర్మాణ పనులకు ఎగబడి, ప్రజలపై దౌర్జన్యం చేస్తోందన్నారు. “ప్రజల కష్టం కనిపించదు కానీ కరకట్ట మాత్రం కనిపిస్తుందా?” అంటూ అధికారుల తీరుపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా “ప్రజల భూములను తీసుకొని, వారిని అడగకుండా కట్టలు వేసే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహసించడమే చేస్తోంది” అన్నారు.2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం జరగాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మైసమ్మ గుడి వద్ద గ్యాస్ గోడౌన్ పక్కన ఉన్న భూసేకరణ ప్రాంతాన్ని బీజేపీ నేతలు పరిశీలించారు. మూడో పట్టణ భాజపా అధ్యక్షురాలు దార్ల మల్లీశ్వరి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, బీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌వీఎస్ యాదవ్, మూడవ పట్టణ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ , మందడపు సుబ్బారావు, గడీల నరేష్, మృత్యుంజయరావు, రజినీ రెడ్డి , మనీ, రుద్రగాని మాధవ్, తోడుపునూరి రవీందర్ , యుగేందర్ ,శ్రీకాంత్ ,వల్లాల రమేష్, వేముల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.