AP: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం వెలుగుచూసింది. ఈ స్కాంను పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు ఎర్రప్ప సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. రూ.100 విలువైన స్టాంపును రూ.లక్ష విలువైనదిగా మార్చి.. 15వేల నకిలీ ఈ-స్టాంపులను ఎర్రప్ప విక్రయించినట్లు గుర్తించారు. MLA సురేంద్రకు చెందిన SRC, అనుబంధ కంపెనీలకు 438 స్టాంప్లు అమ్మారని పోలీసులు వెల్లడించారు. మొత్తం రూ.2 కోట్ల వరకూ లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు.
Post Views: 50








