Mahaa Daily Exclusive

  ఏడాది తర్వాత తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి ..!

Share

AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు ఏడాది తర్వాత వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సొంత నియోజకవర్గం తాడిపత్రిలో అడుగుపెట్టారు. ఆదివారం ఉదయం పట్టణంలోని ఆయన స్వగృహానికి చేరుకున్నారు. అయితే ఆయన చేరుకున్న కొద్దిసేపటికే పోలీసులు మళ్లీ ఆయనను అనంతపురం తరలించారు. కాగా, తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి గతంలోనే హైకోర్టు అనుమతి ఇచ్చింది.