ఆదిలాబాద్, మహా
జిల్లాలో ఈనెల 3 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 2025-2026 ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్శి షా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని ఎస్టీయూ భవనంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఆరు అంశాల పై 250 పాఠశాలల్లో 35 వేల మంది విద్యార్ధులకు అవగాహన కల్పించాలని తెలిపారు. గత సంవత్సరం విజయవంతంగా నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో పెను మార్పులు తీసుకురావడంతో జిల్లాకు మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు. విద్యార్థుల ఉన్నతమైన భవిష్యత్తు, ఆరోగ్యకరమైన అలవాట్లు అలవడుతాయని చెప్పారు. పాఠశాల, కళాశాలల్లో ప్రాథమిక వైద్యా
ధికారులు పాల్గొనాలని, ఆర్ బీఎస్కే టీమ్ మెడికల్ క్యాంపు నిర్వహించాలని సూచించారు. అనంతరం వ్యక్తిగత పరిశుభ్రత,పోషణ,
మానసిక ఆరోగ్యం,
సీజనల్ డిసీజెస్,
పర్సనాలిటీ డెవలప్మెంట్
అనే ఆరు అంశాలలో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సలోని చాబ్రా, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జడ్పి సీఈవో జితేందర్ రెడ్డి, డిఆర్డిఓ రవీందర్ రాథోడ్, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, డిఐఈఓ గణేష్ జాదవ్,డైట్ వైస్ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.







