Mahaa Daily Exclusive

  ప్రధానోపాధ్యాయురాలికి సన్మానం..!

Share

ఆదిలాబాద్, మహా

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోలిపుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ పొందిన జయ- వేణు దంపతులను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యున్నతి కోసం ఆమె చేసిన కృషిని ఉపాధ్యాయులు కొనియాడారు. పాఠశాల అభివద్ధికి అందించిన సేవలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు మురళి, ఉపాధ్యాయులు బెజ్జంకి రవీంద్ర, శేఖర్, సంజీవరావు, భీంరావు, రుబీనా, పాండురంగ్, శాంత తదితరులు పాల్గొన్నారు.

Latest