హన్మకొండ మహా;
ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఆయా ప్రభుత్వ శాఖలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న కొంతమంది దళారులు రాజకీయ నాయకుల పేర్లను వాడుకుంటూ అధికారులను మభ్యపెడుతూ ఆశావాహులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటూ అందినకాడికి దోచుకోవడం పరిపాటిగా మారింది. జీవితంలో ఇక స్థిరపడతామని ఎన్నో ఆశ పెట్టుకున్నా నిరుద్యోగులు అటు మోసపోయి ఇటు అప్పుల పాలైన వారు ఎందరో ఉన్నారు.
మరల ఇదే పరిస్థితి ప్రస్తుతం ఆర్టీసీ లో కండక్టర్లు, డ్రైవర్లు ఔవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీ విషయంలో నెలకొందనిపిస్తుంది.
ఇటీవల ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు ఔట్ సోర్సింగ్ విధానం పై తీసుకోవాలని యాజమాన్యం నిర్ణయించి ఔట్ సోర్సింగ్ 1 ఏజెంట్ల ద్వారా రిక్రూట్మెంట్ చేయమని బస్సు భవన్ నుండి రాష్ట్రంలోని అన్ని రీజియన్లకు సర్కులర్ జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయానికి ఒక సర్క్యులర్ వచ్చింది. ఇదే అధనుగా దళారులు ప్రచార మాధ్యమాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెలరేగితున్నారు. కొంతమంది దళారులు
ఒక్కో ఉద్యోగానికి 2లక్షలు డిమాండ్ చేస్తూ చరవాణిలో, ఆర్టిసి ప్రాంగాణం లోనీ సైకిల్ స్టాండ్ కేంద్రంగా బేరం నడిపిస్తున్నారు. ఏకంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.
ఈ విషయంపై ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి. విజయభాను వివరణ ఇస్తూ
నేటి వరకు ఏ ఒక్క ఏజెంట్ కి రిక్రూట్మెంట్ పర్మిషన్ ఇవ్వలేదని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి. విజయభాను తెలిపారు. ఏజెంట్లు నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో ముడుపులు డిమాండ్ చేస్తున్నారని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా నిరుద్యోగులు ఎవరు జారీ చేయలేదని, నిరుద్యోగుల నుంచి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అటువంటి వారి గుర్తించి తమ దృష్టికి తీసుకొని వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కాగా ఇప్పటికే బస్టాండ్లో అవుట్ గోయింగ్ పక్కన ఉన్న సైకిల్ స్టాండ్లో ఏజెంట్ ఉద్యోగ నియామకం కొరకు అప్లికేషన్లు తీసుకుంటున్నట్టు సమాచారం. అతని తో పాటు మరికొంత మంది హనుమకొండ బస్టాండ్ లో కాంట్రాక్ట్ ఏజెంట్లు ద్వారా ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షన్నర నుండి రెండు లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా మీ ఉద్యోగలు
పర్మనెంట్ కూడా అవుతాయంటూ కొంతమందికి బ్రోకర్లు నమ్మబలుకు తున్నారు. వీరితోపాటు మరికొంతమంది ఏజెంట్లు కూడా నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ మొత్తంలో ముడుపులకు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేకమంది నిరుద్యోగులు ఈ ఏజెంట్లకు బయోడేటా అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేస్తున్నారని బయోడేటా అప్లికేషన్ ఫామ్ తో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎస్ఎస్సి మెమో, క్యాస్ట్ సర్టిఫికెట్లతో పాటు పెద్ద మొత్తంలో ముడుపులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏజెంట్ల వల్ల ఆర్టీసీ కి ప్రజల్లో ఉన్న మంచి పేరు కాస్త పోయి చెడ్డ పేరు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ ఔట్సోర్సింగ్ విధానం వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్టీసీ యాజమాన్యానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని తక్షణమే పై అధికారులు స్పందించి నిరుద్యోగులను మోసం చేస్తున్న దళారుల పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా ఏజెంట్ ద్వారా కాకుండా ఆర్టీసీ యాజమాన్యంమే ఔట్సోర్సింగ్ ఉద్యోగ పోస్టులకు నేరుగా దరఖాస్తులు తీసుకోని భర్తీ చేయాలని ప్రజలు, నిరుద్యోగులు.. అటు ప్రభుత్వాన్ని, ఇటు ఉన్నత అధికారులను కోరుతున్నారు.
ఈ విషయం గురించి తెలుసుకున్న కరీంనగర్ జోన్ విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ రవీందర్ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.







